![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -258 లో..... నర్మద, సాగర్ హాల్ టికెట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. నేను నాన్న గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నానని సాగర్ అనగానే వద్దు సాగర్ రిస్క్ అని నర్మద అంటుంది. లేదు నర్మద తీసుకుంటానని సాగర్ అంటాడు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. వీళ్ళేదో చేస్తున్నారు..అదేంటో తెలుసుకోవాలని శ్రీవల్లి అనుకుంటుంది.
ఆ తర్వాత నర్మద, సాగర్ రామరాజు దగ్గరికి వెళ్తారు. నాన్న నాకు మీ ఆశీర్వాదం కావాలని సాగర్ అంటాడు. ఎందుకు ఒక రోజు అలాగే ఆశీర్వాదం తీసుకొని వెళ్లి నర్మదని పెళ్లి చేసుకొని వచ్చావ్.. ఇప్పుడేం పని చేయబోతున్నావని తిరుపతి అడుగుతాడు. అవును ఇప్పుడు ఆశీర్వాదం ఎందుకని రామరాజు అడుగుతాడు. పక్క ఊరికి పెళ్లికి వెళ్తున్నానని కవర్ చేస్తాడు. సాగర్ ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటే.. ఇందాక సాగర్, నర్మద దేవుడి దగ్గర ఏదో కాగితం పెట్టి మొక్కుకున్నారు. అది సాగర్ జేబులో పెట్టుకోవడం నేను చూసానని శ్రీవల్లి అంటుంది. నిజమేనా ఏంటి ఆ కాగితం ఇవ్వురా అని రామరాజు అడుగుతాడు. సాగర్ హాల్ టికెట్ కాకుండా వేరే పాత బాకీ ఇచ్చే వారి నేమ్స్ ఉన్న లిస్ట్ ఇస్తాడు. అది చూసిన తిరుపతి, రామరాజు ఇదా అని అనుకుంటార. మరొకవైపు కళ్యాణ్ ని ప్రేమ కనిపెట్టాలని అనుకుంటుంది. ఎక్కడికో పరిగెత్తినట్లు వెళ్తుంది. ఇక తనని ఫాలో అవుతున్న కళ్యాణ్ కుడా ప్రేమ కోసం వెతుకుతాడు.. కళ్యాణ్ ని ప్రేమ ట్రాప్ చేసి తనని కనిపెడుతుంది. ఎందుకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావని కొడుతుంది.
మరొకవైపు విశ్వకి వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అవుతుంది. అమ్మాయి వాళ్ళు భద్రవతి కుటుంబం గురించి తప్పుగా మాట్లాడడంతో సేనాపతి వాళ్ళని కొట్టి పంపిస్తాడు. ఇక మనం ఈ ఊళ్ళో ఉండకూడదని విశ్వ అనగానే మనమెందుకు ఉండకూడదు.. ఆ రామరాజు అంతు చూస్తానని భద్రవతి అంటుంది. మరొకవైపు సాగర్, నర్మద ఎగ్జామ్ సెంటర్ కి వస్తారు. సాగర్ కి నర్మద అల్ ది బెస్ట్ చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ ని కొట్టాలని ప్రేమ కర్ర పట్టుకొని అతని వెంట పరిగెడుతుంది. అప్పుడే శ్రీవల్లికి కళ్యాణ్ డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ వెంట ప్రేమ పరిగెత్తడం శ్రీవల్లి చూస్తుంది. అలాగే అటుగా వెళ్తున్న ధీరజ్ కూడా ప్రేమని చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |